‘దాషమకాన్’ టైటిల్ ప్రోమో విడుదల
వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. Harish Kalyan's "Dashamakan"Title Promo - https://youtu.be/1__2ogn744Y టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో వెంబడిస్తుంటారు. హీరో బాత్రూమ్లోకి వెళతాడు. వాళ్లు కూడా ఫాలో అవుతూ వెళతారు. హీరో బాత్రూమ్లో ఒకడ్ని వేసేసి తాపీగా బయటకు నడుచుకుని వస్తాడు. హీరో చంపాలనుకున్న విలన్ మనుషులు…
