ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్ రియాలిటీ షో.. ‘షో టైం’ సినిమా తీద్దాం రండీ
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'షో టైం' సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…