Skip to content

ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్ రియాలిటీ షో.. ‘షో టైం’ సినిమా తీద్దాం రండీ

ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'షో టైం' సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

Read more

విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ పవర్ ఫుల్ యాంథమ్ రిలీజ్

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అర్జున్ చక్రవర్తి యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ సాంగ్ ని పవర్ ఫుల్ కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ స్ఫూర్తిదాయకంగా వున్నాయి. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్ , విఘ్నేష్ పాయ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్న విజువల్స్, వండర్ ఫుల్ లోకేషన్స్…

Read more

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. "రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను…

Read more

అమెరికాలో 43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేసిన హీరో విజయ్ దేవరకొండ

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ. మాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖినః అనే థీమ్‌తో జరిగిన పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ సంఖ్యలో అమెరికాలోని ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్ ను విజయ్ దేవరకొండ స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్…

Read more

సుందరకాండ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హీరో నారా రోహిత్

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుందరకాండ ట్రైలర్, సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత…

Read more

అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల

కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. ఈ మూవీలో సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు. ‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ ‘ఫైటర్…

Read more

పరదా అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుంది: డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు ఆలోచన ఎప్పుడు మొదలైంది ? -ఈ…

Read more

‘ఓజీ’ చిత్రం నుండి ‘కన్మణి’గా ప్రియాంక అరుల్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. 'ఓజీ' రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక…

Read more

కన్యాకుమారి ఆడియన్స్ కు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: మధు షాలిని

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్ మధు షాలిని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రవీణ్ గారికి థాంక్యూ…

Read more

లేత గులాబీ టైటిల్ లాంచ్

79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శతాధిక చిత్రాల హీరో సుమన్ గారు మరియు శతాధిక చిత్రాల దర్శకులు శ్రీ ఓం సాయి ప్రకాష్ గారు లేత గులాబీ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేసి దర్శకుడు మరియు నిర్మాతలను ఆశీర్వదించారు. వారాహి మీడియా హౌస్ సమర్ప ణ లో మీనాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై సుందర్ దర్శకత్వంలో శ్రీనివాస్ మరియు ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం లేత గులాబి. విభిన్న ప్రేమ కథ తో పాటు సమాజ హిత సందేశాత్మక ఈ చిత్రానికి వెంకట్ బాలగోని సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మీడియాకు చెప్పారు.

Read more