Skip to content

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో కృష్ణ వంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన & దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాత గా ఆగస్టు 1వ తేదీన విడుదల అవుతున్న చిత్రం "థాంక్యూ డియర్". ఈ చిత్రంలో హీరోయిన్ గా హెబ్బా పటేల్, త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్, కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే తో వరల్డ్ బర్నింగ్ ఇష్యూ గురించి వివరించిన ఈ చిత్రం విడుదల కాకముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక 15th…

Read more

డివైన్ స్టార్ రిషబ్ శెట్టితో భారీ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం.36 లో కథానాయకుడిగా రిషబ్ శెట్టి అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. 'కాంతార' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం 'కాంతార 2' చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక…

Read more

‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హృతిక్ రోషన్, కియారా అద్వానీ పై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్’

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద అయాన్ ముఖర్జీ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్‌ను అయాన్ ముఖర్జీ ఇచ్చారు. ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈరోజు (జూలై 29) తన సోషల్ మీడియాలో ‘వార్ 2’ లోని మొదటి పాట ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ వేశారు. సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటించిన ఈ రొమాంటిక్ సాంగ్ గురించి చిత్రయూనిట్…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు…

Read more

‘సతీ లీలావతి’ టీజర్ విడుదల

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించిన ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సతీ లీలావతి’. మంగళవారం రోజున మేకర్స్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్ సీన్‌లోనే దేవ్ మోహన్‌ను లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను…

Read more

హెబ్బా పటేల్, రేఖ నిరోషా, ధనుష్ రఘుముద్రి నటించిన “థాంక్యూ డియర్” చిత్ర ట్రైలర్ విడుదల – ఆగస్టు 1వ తేదీన విడుదల

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ రచన దర్శకత్వంలో ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించగా వీర శంకర్ నాగ మహేష్ రవి ప్రకాష్ చత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి పి.ఎల్.కె రెడ్డి డిఓపిగా పని చేయగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేయగా చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. చిత్ర…

Read more

అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్ 2’లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం రంగంలోకి బ్రహ్మాస్త్ర ‘కేసరియా’ టీం

అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్‌ భారీ ఎత్తున నిర్మించింది. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు…

Read more

వార్ 2 లోని సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ ప్రేమ పాట హిందీ భాషతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది

సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ నటించిన వార్ 2 నుండి మొదటి పాట జూలై 31న తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ పాటను కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ నుండి వస్తోన్న ఈ రొమాంటిక్ ట్రాక్ ఒక ఫ్లాష్‌బ్యాక్ సాంగ్, ఇది హృతిక్ కబీర్ మరియు కియారా కావ్య గా ఎమోషన్ సాంగ్ గా తెరకెక్కింది, ఈ సాంగ్ కబీర్ గతాన్ని తిరిగి గుర్తుచేసే లవ్ సాంగ్ గా చెప్పవచ్చు. ఈ రొమాంటిక్ సాంగ్ హృతిక్ యొక్క రహస్యమైన గూఢచారి మరియు కియారా ఫ్రాంచైజీకి కొత్తగా జోడించబడిన వారి మధ్య నేపథ్య కథలోకి తీసుకొనివెళుతోంది…

Read more

‘కాంత’ గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ కాంత ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు, ఈ టీజర్ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచింది వెర్సటైల్ యాక్టర్ చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య…

Read more