Skip to content

‘యముడు’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను -నిర్మాత బెక్కెం వేణుగోపాల్

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. తాజాగా యముడు ఆడియోలాంచ్ ఈవెంట్‌ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక లాంచ్ చేశారు. రెండో పాటను బెక్కెం వేణుగోపాల్ గారు రిలీజ్ చేశారు. మూడో పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక గారు, యముడు నాలుగో పాటను…

Read more

అర్జున్ చక్రవర్తి అందరికీ నచ్చుతుంది – డైరెక్టర్ విక్రాంత్ రుద్ర &టీం

-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి లాంచ్ చేసిన ‘అర్జున్ చక్రవర్తి' గ్రిప్పింగ్ టీజర్ విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం…

Read more

వార్ 2 అత్య‌ధిక వ్యూస్‌తో స‌రికొత్త హిస్ట‌రీ

వార్ 2 ట్రైల‌ర్‌లో పాన్ ఇండియ‌న్ స్టార్స్ హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ఫెరోషియ‌స్ లుక్‌లో అద‌ర‌గొట్టారు. నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతూ హృతిక్‌, ఎన్టీఆర్‌ మ‌ధ్య సాగే యాక్ష‌న్ సీక్వెన్స్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. టాప్ నాచ్ విజువ‌ల్స్‌, బీజీఎమ్‌తో పాటు ఐ ఫీస్ట్‌గా సాగుతూ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్‌ను క‌లిగించింది. ట్రైల‌ర్‌...ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని రెట్టింపు చేసింది. ఇద్ద‌రు మెగాస్టార్స్ విశ్వ‌రూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ పిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను…

Read more

తెలుసు కదా నుంచి మల్లిక గంధ లాంచ్

-మల్లారెడ్డి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన 'తెలుసు కదా' మూవీ టీం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది…

Read more

కూలీ’ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర.. స్టార్స్ అందరూ పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించిన ట్రైలర్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ అదిరిపోయింది…

Read more

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ గ్లింప్స్ విడుదల

దుల్కర్ సల్మాన్.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బహుభాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్. ఎన్నో వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో ఆయన మెప్పిస్తున్నారు. ఈ విలక్షణత కారణంగానే ఆయన చేస్తున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటివే అందుకు ఉదాహరణలు. ఈ వెర్సటైల్ యాక్టర్ ఇప్పుడు వినూత్నకథా శైలితో యూనిక్ సినిమాలను తెరకెక్కించే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ…

Read more

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’…

Read more

”బాలుగాడి లవ్ స్టోరీ” ఆగస్ట్ 8న థియేటర్స్ లో విడుదల !!!

ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను 'సిల్వర్ స్క్రీన్' గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు, బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ఆద్యాంతం నేటి యూత్ కు నచ్చేలా రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కు మంచి…

Read more

30వేల టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా...24 గంటల్లోనే 30 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో కింగ్డమ్ సినిమా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మీద ఆడియెన్స్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఈ టికెట్ బుకింగ్స్ తో తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ ప్రీ సేల్స్ లో కింగ్డమ్ జోరు చూపిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ క్రేజ్ చూసిన మేకర్స్ కింగ్డమ్ కు పెద్ద ఎత్తున ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 30న కింగ్డమ్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి. రీసెంట్ గా…

Read more

ప్రైమ్ వీడియోలో సత్య దేవ్ నటించిన అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో ఆగస్టు 8 న విడుదల

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలిని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి మరియు చింతకింది శ్రీనివాసరావు రూపొందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌కు దర్శకత్వం వహించినది వి.వి. సూర్య కుమార్. అరేబియా కడలిలో ప్రముఖ నటులు సత్యదేవ్ మరియు ఆనంది ప్రధాన పాత్రల్లో నటించగా, నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట…

Read more