Skip to content

‘బ్రాట్’ తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది: నరేష్ వికే

డార్లింగ్ కృష్ణ, మనీషా హీరో హీరోయిన్స్ గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ మూవీ 'బ్రాట్'. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంజునాథ్ కంద్కూర్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి యుద్ధమే రాని సాంగ్ ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని నవరసరాయ డాక్టర్ నరేష్ వికే లాంచ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ రాశారు. ఈ బ్యూటీఫుల్ లవ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నవరసరాయ డాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ…

Read more

‘చైనా పీస్’ మంచి విజయాన్ని సాధిస్తుంది: సందీప్ కిషన్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్…

Read more

మేం తీసిన చిత్రాలన్నీ ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు -మురళీ మోహన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..   మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్…

Read more

కూలీ సినిమాని అందరూ ఎంజాయ్‌ చేస్తారు – శ్రుతీహాసన్‌

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతి హసన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు…

Read more

సాయి కుమార్ బర్త్ డే స్పెషల్

విలక్షణ నటుడు సాయి కుమార్ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్​లు మన కళ్ల ముందు మెదులుతాయి. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాదితోనే ఆయనకు నటుడిగా 50 ఏళ్లు నిండాయి. ఈ 50ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇలాంటి అద్వితీయ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. 1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ చిత్రం కూడా…

Read more

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్‌డమ్’ చిత్రంతో ఘన విజయం సాధిస్తాను : విజయ్ దేవరకొండ తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో…

Read more

ప్రపంచ సినిమా చరిత్రలోనే ప్రప్రథమం ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా ఘనతకెక్కిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైద్రాబాద్ లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది!!

Read more

అభినయ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాల టైటిల్ ‘కామాఖ్య’

సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కామాఖ్య అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. డివైన్ వైబ్ తో వున్న టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్. ఈచిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. నటీనటులు: సముద్రఖని, అభిరామి,ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్,…

Read more

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ట్రైలర్ లాంచ్

యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిడం ఆనందంగా వుంది. ఆగస్టు 22న సినిమా రిలీజ్ అవుతుంది. నిర్మాత ఉమా గారికి…

Read more

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

ప్రముఖ నటుడు అలీ ఓ రియాలిటీ షో షూటింగ్‌ కోసం గోవా వెళ్లారు. అలీ షూటింగ్‌కు వచ్చిన సంగతి తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా వచ్చి తనను కలవాలని అలీకి చెప్పటంతో అలీ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిశారు. ఈ సందర్భంగా అలీగురించి తెలుసుకున్న ఆయన అలీతో మాట్లాడుతూ దాదాపు 1260 సినిమాల్లో నటించటం అంటే చాలా పెద్ద విషయం అంటూ అలీని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే గోవాలో జరిగే గోవా ఫిలిం ఫెస్టివల్‌ (జిఎఫ్‌ఎఫ్‌) కార్యక్రమానికి అతిథిగా రావాలని అలీని కోరటంతో ముఖ్యమంత్రి ప్రమోద్‌తో ఖచ్చితంగా పాల్గొంటానని మాటిచ్చారు. అంటే ఈ ఏడాది జరిగే ఫిలిం ఫెస్టివల్‌ వేడుకల్లో అలీ పాల్గొంటున్నారన్నమాట.

Read more