Skip to content

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు” చిత్రం సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది – డైరెక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు దక్కించుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "ఆపద్భాంధవుడు" శ్రీ పెంచల్ రెడ్డి. డి. లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా గుర్తింపు…

Read more

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ “మిస్స్టీరియస్” సినిమాలోని “అడుగు అడుగునా ” అనే పాట ని విడుదల చేయడమైనది

ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ "మిస్స్టీరియస్" సినిమాలోని "అడుగు అడుగునా " అనే పాట ని విడుదల చేయడమైనది. ఈ పాట అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారిపై చిత్రీకరించబడింది. ఈ పాటని చుసిన కమీషనర్ CV ఆనంద్ గారు పాట పాడిన MLR కార్తీకేయన్ ని మెచ్చుకుంటూ పాటని అద్భుతంగా చిత్రకరించారని కొనియాడారు.పోలీస్ యొక్క నిబద్ధతని అద్భుతంగా రాసి మరియు పాట కి సంగీత దర్శకత్వం వహించిన ML రాజా ని అభినందించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేసిన దర్శకులు మహీ కోమటిరెడ్డి ని, మరియు అమెరికాలో స్థిరపడి కూడా ఎన్నో…

Read more

*మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.. ‘మోతెవరి లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో అనిల్ గీలా

భారత దేశపు అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించిన సిరీస్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు…

Read more

త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌ రిలీజ్

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 22న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ‘చూడు బార్బరికా.. ఈ యుద్దం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి…

Read more

చిత్రపురిలో 300 కోట్ల స్కాం

వల్లభనేని అనిల్‌ను అరెస్ట్ చేయాలంటూ FDC వద్ద సినీ కార్మికుల మహాధర్నా హైదరాబాద్: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు ₹300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ, వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే…

Read more

వార్ 2’ కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లకు హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

ఇండియన్ ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్‌ చేశారు. ‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని…

Read more

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

విషయం : ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ విభాగంలో నుండి పని చేసిన సభ్యుల పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తూ... పై విషయం గురించి యావత్ సినీ పరిశ్రమకు, ప్రజలకు మరియు డిజిటల్ మీడియా/ప్రింట్ మీడియా వారికి తెలియజేయునది ఏమనగా.. సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించే /నిరించే కళాదరక్షులు చాలా కీలకం అన్నవిషయం తెలిసినదే. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపములో చూపించే మేధాసంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం.. అంతటి విలువైన /ప్రాముఖ్యత కలిగిన విభాగముపై ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానలులో "ఆర్ట్ మాఫియా" అంటూ వ్యాఖలు చేసిన సదరు పీపుల్స్…

Read more

యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా అందరూ తప్పకుండా చూడాలి – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్*

మనం పిల్లల మీద ఎంత ఒత్తిడి పెడుతున్నామో యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి చూపించారు …స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్- స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి…

Read more

సతీ లీలావతి’ నుంచి ‘చిత్తూరు పిల్ల’ పాట విడుదల

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే ఈ పాటను చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాటను వనమాలి రచించగా.. నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్…

Read more

‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి…

Read more