ఎంజీఆర్ తుకారాం, ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్ “కాగితం పడవలు” హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్ రిలీజ్
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "కాగితం పడవలు'అనే టైటిల్ పెట్టారు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ''చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్''అనే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. తీరంలో ఓ జంట కలుసుకోవడం, విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వున్నాయి. సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి. దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ,…