అనుష్క ఘాటీ సెప్టెంబర్ 5న రిలీజ్
మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్ ని రివిల్ చేశారు. ఈ చిత్రంలో క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ నటిస్తుండగా, విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది…