Skip to content

అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేలా చేసిన చిత్రం ‘కింగ్‌డమ్’ : కథానాయకుడు విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన…

Read more

‘మదరాసి’ నుంచి సెలవిక కన్నమ్మా రిలీజ్

వెరీ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఇద్దరూ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా మదరాసి. అద్భుతమైన థ్రిల్‌ తో పాటు మాస్ ఎంటర్టైనర్స్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణీ వసంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లిమ్స్‌ భారీ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఫస్ట్ సింగిల్ సెలవిక కన్నమ్మా తో మ్యూజికల్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారు. టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండగా, ఈ పాట మాత్రం వెరీ డిఫరెంట్…

Read more

యూకే సినీప్లెక్స్ నాచారంలో ప్రారంభం

హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన అనుభవానికి.. వినోదానికి మరో చిరునామా చేరింది... అదే యూకే సినీ ప్లెక్స్‌. హైదరాబాద్‌లోని నాచారంలో అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించిన ఈ యూకే సినీ ప్లెక్స్‌ను బుధవారం ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ యూకే సినీప్లెక్స్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ఎంతో ఉన్నతంగా ఉంది. సౌండ్‌ సిస్టమ్‌, స్క్రీన్‌, సీట్లు ఎంతో బాగున్నాయి. ఉప్పల్‌, హబ్సిగూడ, నాచారంలో ఉండేవారికి ఈ మల్టీప్లెక్స్‌ వినోదాన్ని పంచడంలో సరికొత్త ఎక్స్‌ పీరియన్ష్‌ ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో శ్రీమతి పృతికా ఉదయ్ , శ్రీ రుషిల్ ఉదయ్‌లతో…

Read more

మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి. మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్! ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి' ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి. సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది. https://youtu.be/sOD5wwC1kGw?si=C5TOErgeYmy2VQGV ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి…

Read more

మిత్ర మండలి’ నుంచి ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల

'కత్తందుకో జానకి' శైలిలో 'మిత్ర మండలి' నుంచి మరో సరదా గీతం 'స్వేచ్ఛ స్టాండు' ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, 'కత్తందుకో జానకి' గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా…

Read more

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ),…

Read more

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more

ఘనంగా అధికార ప్రదానోత్సవం

మణికొండలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరై, హెడ్‌ బాయ్, హెడ్‌గర్ల్, హౌస్‌ కెప్టెన్స్‌కి బ్యాడ్జ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా కస్తూరి నరేంద్ర మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ అనిత మాట్లాడుతూ–‘‘విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో…

Read more

ఘనంగా అధికార ప్రదానోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, అపోలో హాస్పిటల్‌ వైద్యురాలు జేబ కలీల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి, డీన్‌ మల్లేష్,…

Read more

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఉన్న అమెరికాలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్ మెక్కినీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సువర్ణ హస్తాలతో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన హనుమాన్ చాలీసా విడుదల జరిగింది. శ్రీ గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దంలో అవధి భాషలో రచించిన ఈ హనుమాన్ చాలీసా, తెలుగు, తమిళ్, కన్నడ, ,హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఆయా భాషలవారు చదువుకుంటూ పాడుకునేలా వీడియో రూపొందించటం జరిగింది అని దీని కార్యనిర్వహక నిర్మాత రఘురామ్ బొలిశెట్టి తెలియజేశారు. హనుమంతుని అపార శక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందని దీనిని రూపొందించిన RP పట్నాయక్ అన్నారు. శ్రీ గణపతి…

Read more