మెగాస్టార్ చిరంజీవి, నయనతార, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ప్రోమో రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మన శంకరవ ప్రసాద్ గారు" తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌ని స్పెషల్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. ప్రతి పాటకీ మెగాఅన్న ప్రిఫిక్స్ జోడించి మెగా గ్రేస్, మెగా స్వాగ్, మెగా మాస్ అంటూ క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ ఐడియా ఫ్యాన్స్,…
