‘ఆ గ్యాంగ్ రేపు 3’ ఫస్ట్ లుక్ విడుదల
ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొందిన 'ఆ గ్యాంగ్ రేపు'తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్ చిత్రం 'ఆ గ్యాంగ్ రేపు-2' షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్ నుండి రాబోతున్న మరో సన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆ గ్యాంగ్ రేపు-3' త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగీ కుమార్ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్ ఫిల్మ్ లవ్ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్…
