టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్
ఎక్స్‌ట్రార్డినరీ, అటార్నీ వూ తో పాటు అనేక విజయవంతమైన కొరియన్ డ్రామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-సిక్, 2025 హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తుకున్నారు. డిసెంబర్ 1న, దర్శకుడు యూ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌కు నాయకత్వం వహించారు, అతని సృజనాత్మక , నిర్మాణ శైలి, తెరవెనుక అనుభవాల గురించి అరుదైన ఇన్ సైట్స్ అందించారు. ఈ సెషన్‌లో కె-డ్రామా అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత, డైరెక్టర్ యూ హైదరాబాద్‌లోని ది లీలాలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న కంటెంట్…
