Skip to content

సెప్టెంబర్ 5న రాబోతోన్న హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్ యూ రా’.. ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్‌గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ సినిమాను నేను చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ మూవీతో అసోసియేట్ అయ్యాను. ఎక్కడా కూడా కొత్త వాళ్లు ఈ మూవీని చేసినట్టుగా అనిపించదు. ఈ మూవీ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నేచర్‌లో తీసిన నేచురల్ మూవీ’ అని అన్నారు.

దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా టీంకు థాంక్స్. మా మూవీని చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారికి థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. నాకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్పూర్తి. చిన్న చిత్రాల్ని కూడా మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మా మూవీని మీడియా ప్రమోట్ చేయాలని, ఆడియెన్స్ వరకు రీచ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటుడు కృష్ణ సాయి మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా దర్శకుడు ఈ చిత్రం గురించి చాలా కష్టపడ్డారు. మా హీరో చిన్ను, హీరోయిన్ గీతిక చక్కగా నటించారు. మా సినిమాను సక్సెస్ చేయాలని ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శక, నిర్మాత నాగేష్ మాట్లాడుతూ .. ‘సముద్రాల క్రియేషన్స్ బ్యానర్ మీద తీసిన చిత్రం ‘లవ్ యూ రా’. దర్శకుడు ప్రసాద్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. సినిమాలో దమ్ముంటే.. అది చిన్నదా? పెద్దదా? అని ఆడియెన్స్ పట్టించుకోరు. హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు. పాటలు బాగున్నాయి. ‘లవ్ యూ రా’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. దయానంద్ ఈ మూవీకి మంచి థియేటర్లు దక్కేలా చూడాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నాగతేజ మాట్లాడుతూ .. ‘పల్లెటూరిలో జరిగే అందమైన ప్రేమ కథ ఈ ‘లవ్ యూ రా’ చిత్రం. కొత్త వాళ్లమైనా కూడా అందరం కలిసి ఓ మంచి చిత్రాన్ని చేశాం. మాలాంటి కొత్త వాళ్లందరినీ ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.