- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కృతి, జానపదాలు మరియు పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.
పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఉత్కంఠభరితమైన యుద్ధభూమి దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె. గఫూర్ మెప్పించారు.
డొమినిక్ అరుణ్ రచయితగా వ్యవహరించిన ఈ చిత్రానికి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్ లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఓ గొప్ప దృశ్యకావ్యాన్ని చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.
‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు.*