Skip to content

‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ఎవరే నువ్వే రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. తమిళ వెర్షన్‌కు విఘ్నేష్ రామకృష్ణ, హిందీ వెర్షన్‌కు నుమాన్ ఖోకర్, కన్నడ వెర్షన్‌కు హృదయ శివ సాహిత్యం అందించారు. కన్నడ వెర్షన్‌ను అనిరుద్ధ్ సుస్వరం ఆలపించారు. విడుదలైన వెంటనే ‘మళవిల్లాయే’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పాట వైరల్‌గా మారింది…

Read more
‘కొత్త లోక’ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్ Telugu News

‘కొత్త లోక’ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం 'లోకా చాప్టర్ 1: చంద్ర'. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, 'కొత్త లోక 1: చంద్ర' పేరుతో విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కొత్త లోక 1: చంద్ర'.. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు…

Read more
‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల Telugu News

‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల

భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా 'కొత్త లోక 1: చంద్ర' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కృతి, జానపదాలు మరియు పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క…

Read more