Skip to content

*తెలుగులోనూ రాణించాలన్నదే* *తన ధ్యేయమంటున్న* *కన్నడ భామ రూపాలి ఎస్.డి*

Add a little bit of body text
91195d7c-32af-47ea-a5c2-22a9394a390b
dce5b81f-7d7a-4bc1-a3e9-67896b7b89cf
c5f8233a-6ee9-499c-a33a-c9918e370a0b
3868a141-c748-4573-a296-85a7b78be256

ఐశ్వర్యారాయ్, శిల్పా శెట్టి మొదలుకుని… అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న వరకు- ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా నడుస్తోంది. ఆ జాబితాలో తన పేరు కూడా చేర్చుకోవాలని తహతహలాడుతోంది తెలుగు మూలాలు కలిగిన కన్నడ భామ రూపాలి ఎస్.డి. నాట్యంలో మంచి ప్రావీణ్యురాలైన ఈ అమ్మడు… అభినయంలోనూ శిక్షణ పొంది, మోడలింగ్ ద్వారా దర్శకనిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షించింది!!

కన్నడలో “గంగి గౌరి, తారకేశ్వర్” చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ… “కోరా” అనే చిత్రంలో డేరింగ్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసి, మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో త్వరలో విడుదల కానుంది!!

ఈ భామ అభినయ సామర్ధ్యం తెలుగునాట కూడా పాకడంతో… “భైరవి” అనే సూపర్ హిట్ సీరియల్ లో ప్రతినాయకి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. మాతృభాష తెలుగు కావడంతో కన్నడలాగే తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడే రూపాలి… తెలుగు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జిమ్నాస్టిక్స్ లోనూ సిద్ధహస్తురాలైన ఈ బ్యూటీ, పోరాట సన్నివేశాలు రక్తి కట్టించడంలో మహా నేర్పరి!!