విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక…
తెలుగు సినీ & టివి కాస్టూమర్స్ యూనియన్ నాయకుల దోపిడీని అరికట్టండి

న్యాయం జరిగేవరకు
మా పోరాటం ఆగదు!
భూ పోరాట సమితి కన్వీనర్
సీనియర్ సభ్యులు రమేష్
“తెలుగు సినీ & టివి
కాస్టూమర్స్ యూనియన్
నాయకుల దోపిడీని అరికట్టండి” అని పిలుపునిస్తున్నారు సదరు సంఘం సీనియర్ సభ్యులు, భూ పోరాట సమితి నాయకులు రమేష్. ఆయన మాట్లాడుతూ…
“తెలుగు సినీ అండ్ టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ 330 మంది సభ్యులకి 2017 సంవత్సరంలో మెంబర్స్ అందరికీ భూమి కొనిస్తామని డబ్బులు వసూలు చేసి 20 ఎకరాలకి అగ్రిమెంట్ చేసి 16 ఎకరాల 36 గుంటలకి యూనియన్ నుంచి డబ్బు కట్టి 13 ఎకరాల 12 గుంటలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ప్రస్తుతానికి భూమి అంతా పోయినట్టు చెబుతూ 7 ఎకరాల 2 గుంటలు మాత్రమే మిగిలిందని, దానిని డెవలపర్ సురేష్ అనేవారికి డెవలప్మెంట్ కి ఇచ్చి … మెంబర్స్ ని మోసం చేసే విధంగా మా లీడర్స్ అగ్రిమెంట్ వేసి…8 సంవత్సరాలుగా ఎవరికీ భూమి ఇవ్వకుండా అందర్నీ ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు.
భూమికి డబ్బు కట్టి ఎదురుచూసిన మా మెంబర్స్ ఇప్పటికి 25 మంది చనిపోయారు. మా భూమి కోసం… మా మెంబర్స్ అందరికీ న్యాయం కోసం… మా సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆదివారం (15/6/2025) ఇందిరా పార్క్, ధర్నా చౌక్ లో ధర్నా చేసాము. మా మెంబర్స్ అందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడుతుంటాము” అని అన్నారు!!