అర్హులైన సినీ జర్నలిస్టులకు ‘రెగ్యులర్ మెంబర్‌షిప్’ కల్పిద్దాం
ప్రియమైన ఫిలిం జర్నలిస్టు మిత్రులారా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన అసోసియేట్ సభ్యులందరినీ రెగ్యులర్ సభ్యులుగా ప్రమోట్ చేస్తామని ఇచ్చిన హామీని మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ హామీకి మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నేను ఈ అంశంపై ఒక వినతిపత్రాన్ని సమర్పించాను. ఆ వినతిపత్రం ఉద్దేశం ఒక్కటే... సుదీర్ఘకాలంగా సినీ రంగంలో విశేష సేవలందిస్తున్న, అన్ని అర్హతలు కలిగిన సీనియర్ ఫిలిం జర్నలిస్టులకు న్యాయం జరగాలని కోరడం. సినీ…
