అథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం…
అర్హులైన సినీ జర్నలిస్టులకు ‘రెగ్యులర్ మెంబర్‌షిప్’ కల్పిద్దాం
ప్రియమైన ఫిలిం జర్నలిస్టు మిత్రులారా,
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన అసోసియేట్ సభ్యులందరినీ రెగ్యులర్ సభ్యులుగా ప్రమోట్ చేస్తామని ఇచ్చిన హామీని మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ హామీకి మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నేను ఈ అంశంపై ఒక వినతిపత్రాన్ని సమర్పించాను. ఆ వినతిపత్రం ఉద్దేశం ఒక్కటే… సుదీర్ఘకాలంగా సినీ రంగంలో విశేష సేవలందిస్తున్న, అన్ని అర్హతలు కలిగిన సీనియర్ ఫిలిం జర్నలిస్టులకు న్యాయం జరగాలని కోరడం.
సినీ జర్నలిస్టులు కూడా ఇతర విభాగాల జర్నలిస్టుల మాదిరిగానే సమాజానికి సమాచారం, విశ్లేషణ, వినోదాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల అనుభవం, సీనియార్టీ, వృత్తిపరమైన అర్హతలు ఉన్నప్పటికీ, వారిలో చాలామంది ఇప్పటికీ ‘అసోసియేట్ మెంబర్‌షిప్’కే పరిమితమయ్యారు. ఇది వారి అనుభవానికి, సేవలకు, వృత్తిపరమైన గౌరవానికి ఏమాత్రం తగినది కాదు.
అందువల్ల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మా తరఫున ఈ క్రింది అంశాలను సానుకూలంగా పరిశీలించాలని కోరుతున్నాము:
అర్హతలు, అనుభవం, సీనియార్టీ ఆధారంగా సీనియర్ ఫిలిం జర్నలిస్టులను తక్షణమే ‘రెగ్యులర్ మెంబర్లుగా’ ప్రమోట్ చేయాలి.
ఇతర విభాగాల జర్నలిస్టులకు ఉన్నట్లే ఫిలిం జర్నలిస్టులకు కూడా సమాన హక్కులు, ఓటు హక్కు, సభ్యత్వ గౌరవం కల్పించాలి.
భవిష్యత్తులో ఫిలిం జర్నలిస్టుల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా, వారి వృత్తిపరమైన గుర్తింపును, గౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
నూతన కమిటీ ఈ సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి, అర్హులైన ఫిలిం జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నాను. మనందరి ఐక్యత, పరస్పర సహకారంతో ఈ న్యాయమైన డిమాండ్ త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను.
ఇట్లు,
దయ్యాల అశోక్
ఎగ్జిక్యూటివ్ మెంబర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్

