‘చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది’ : నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ
▪️నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు ▪️ థియేటర్ల కేటాయింపు నుంచి ఓటీటీ వరకు అన్నిచోట్ల అడ్డంకులే ▪️ ఫిల్మ్ చాంబర్ స్పందించడం లేదు ▪️ పీవీఆర్, ఐనాక్స్కు నోటీసులు పంపించాను ▪️ చిన్న సినిమాలను బతికించమని వేడుకుంటున్నా హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి…
