Skip to content
తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి Telugu News

తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి

▪️రెడ్ క్రాస్ సొసైటీకి మద్దతుగా విరాళం ▪️ అభినందించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హైదరాబాద్: టాలీవుడ్ హీరో కృష్ణసాయి తన సేవా కార్యక్రమాలతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు మద్దతుగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును విరాళంగా అందించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు అంశాల‌పై వీరిద్ద‌రు చ‌ర్చించుకున్నారు. కృష్ణసాయి తన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు…

Read more
కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం –  డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల Telugu News

కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం – డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

▪️కొత్తద‌నంతో కూడిన సినిమాలు చేయ‌డ‌మే ఇష్టం ▪️ 'M4M' ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన "M4M" మూవీ టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సారి ద‌ర్శ‌కునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా…

Read more
‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ Telugu News

‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే నా లక్ష్యం: హీరోయిన్ జో శర్మ

▪️"M4M (మోటివ్ ఫర్ మర్డర్)" హైలైట్స్ చెప్పిన హీరోయిన్ ▪️ ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు ▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల ▪️ 5 భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన "M4M" మూవీ ▪️ సినిమాలో విల‌న్ ఎవ‌రో చెబితే రూ. ల‌క్ష ప్రైజ్ మ‌నీ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ "M4M (మోటివ్ ఫర్ మర్డర్)". అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న…

Read more
ఆ న‌లుగురే ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తొక్కేశారు : షెరాజ్ మెహదీ Telugu News

ఆ న‌లుగురే ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తొక్కేశారు : షెరాజ్ మెహదీ

▪️రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వ‌లేదు ▪️ చిన్న సినిమాలను చంపేస్తున్న‌ మాఫియా ▪️ ఇండస్ట్రీ పెద్దలకు, సీఎంకి నోటీసులు ఇచ్చాం ▪️ లీగ‌ల్‌గా ఫైట్ చేస్తున్నాం: షెరాజ్ మెహదీ హైదరాబాద్‌: తెలుగు సినిమా పరిశ్రమలో మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోంద‌ని నటుడు–నిర్మాత షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. “మంచి సినిమాలను కిల్ చేస్తున్నారు. చిన్న సినిమాలను నలుగురు రాక్షసులు చంపేస్తున్నారు. నైజాం ఏరియాలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఇది వ్యవస్థత్మకంగా జరుగుతోంది” అని షెరాజ్ మెహదీ అన్నారు. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం ప్రారంభించామని, ఇండస్ట్రీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి…

Read more
ఘనంగా   ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో…

Read more
మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్ Telugu News

మే 22న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం రిలీజ్

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్ ▪️ న‌టుడు కృష్ణ‌సాయి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌పై స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల‌ ▪️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త షేడ్స్ - నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్ ▪️ విభిన్న కథ, పవర్‌ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…

Read more
వివ రెడ్డి కి చార్లీ చాప్లిన్ అవార్డు Telugu News

వివ రెడ్డి కి చార్లీ చాప్లిన్ అవార్డు

హైదరాబాద్‌: సినిమా తెరపై కనిపించే ప్రతి అక్షరానికి ఒక జీవం ఉంటే, ఆ జీవానికి రూపం ఇచ్చే కళాకారుడు వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు). అక్షరాలను అలంకరించే చేతి గీతల్లో భావాలను పలికించగల అరుదైన సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచిన ఆయనకు, ప్రపంచ హాస్య చక్రవర్తి చార్లీ చాప్లిన్ 137వ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మక చార్లీ చాప్లిన్ అవార్డు లభించింది. ర‌వీంద్ర‌భార‌తీ వేదికగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రోజా క్రియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో, తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షులు డా. బండ ప్ర‌కాష్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేతుల మీదుగా ఈ గౌరవం వివ రెడ్డి కి అందించి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఈ వేడుక‌లో పాల్గొన్న…

Read more
ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ Telugu News

ఏప్రిల్ 24న ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్

మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, "అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన…

Read more
‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌ Telugu News

‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

▪️ ‘ఎం4ఎం’లోని బాల‌య్య‌కు బాగా న‌చ్చిన ''హూ ఈజ్ ద కిల్ల‌ర్..'' పాట‌ ▪️ మే 8న విడుదలకు సిద్ధమైన ‘ఎం4ఎం’ ▪️ ప్రపంచవ్యాప్తంగా 5 భాష‌ల్లో రిలీజ్ ▪️ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం (Motive for Murder) ▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం హైదరాబాద్: జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “Who is the Killer” పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా…

Read more
మహిళలకు “డైమండ్ డెకాయిట్” చిత్రం ఉచితం Telugu News

మహిళలకు “డైమండ్ డెకాయిట్” చిత్రం ఉచితం

▪️ ఏప్రిల్‌ 10న విడుదల “డైమండ్ డెకాయిట్” విడుదల ▪️ ట్రైలర్‌ను వీక్షించి అభినందించిన కే. రాఘవేంద్ర రావు ▪️ రిలీజ్ అయ్యే థియేటర్ లలో మహిళలకు 4 షోలు ఉచిత ప్రదర్శన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం ఈ నెల ఏప్రిల్‌ 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు…

Read more