Skip to content

‘గరివిడి లక్ష్మి’ నుంచి కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని చరణ్ అర్జున్ స్వయంగా సాహిత్యం అందించి ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. అనన్య భట్, చరణ్ అర్జున్ పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గరివిడి లక్ష్మి మన ఊరి పాటలు, అనుభూతులు, మన మూలాల నుంచి వచ్చే ఆత్మగౌరవానికి సెల్యూట్ లాంటి సినిమా.

అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: నరేష్, రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని

సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుకుమార్ కిన్నెర,
asst. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దుర్గా ప్రసాద్, క్రాంతి కుమార్ దత్తి
ప్రొడక్షన్ కంట్రోలర్: విశ్వేష్ అంపోలు, దాసరి రాజు బాల కృష్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.