Skip to content

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా

హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.

నరేంద్ర, లిల్లీ బళ్ళు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్‌జీఆర్ కథ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నటుడు సమీర్ మాట్లాడుతూ.. “నరేంద్ర మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. గతంలో నాతో కలిసి పనిచేశాడు. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడే తత్వం ఉన్నవారు. ఈ టీమ్ భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘విలేజ్ స్టార్స్’ చిత్రానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అన్నారు.

హీరో, దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ.. “చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ లిల్లీ బళ్ళు మాట్లాడుతూ.. “నేను ఒడిశాకు చెందిన అమ్మాయిని. నాకు ‘విలేజ్ స్టార్స్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన నరేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాను” అన్నారు.

జబర్దస్త్ నటుడు వాసు మాట్లాడుతూ.. “విలేజ్ స్టార్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది. సినిమా తొలి అడుగే విజయానికి సంకేతంగా నిలిచింది. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్న ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అన్నారు.

సామాజిక కార్యకర్త సంపత్, నటుడు రాధాకృష్ణ తదితరులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, నూతన ప్రతిభకు ప్రేక్షకులు అండగా నిలవాలని వారు కోరారు.

నూతన కథాంశంతో రూపొందుతున్న ‘విలేజ్ స్టార్స్’ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.

నటీనటులు: నరేంద్ర, లిల్లీ బళ్ళు, శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు
బ్యానర్: ఎన్‌ఎస్‌వీ ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏ. నరేంద్ర
కథ: నాగూర్ ఎన్‌జీఆర్
పీఆర్వో: అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.