పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా
హైదరాబాద్: తెలుగు తెరపైకి మరో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతొంది. ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న నూతన చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. నరేంద్ర, లిల్లీ బళ్ళు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్జీఆర్ కథ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు సమీర్ మాట్లాడుతూ.. “నరేంద్ర మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. గతంలో నాతో కలిసి పనిచేశాడు. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడే…
