Skip to content

‘శివాలయం’ మూవీ ప్రారంభం

5 22
7 23

తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభమైంది. ఆచంట మహేష్ (రంగస్థలం ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దేవునిపటాల సమక్షంలో నిర్వహించిన ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
నటుడు, నిర్మాత లెంకల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. “దర్శకుడు, నిర్మాత వెంకట్‌రెడ్డి గారు గత ఆరు నెలలుగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. దేవుడి పేరుతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ‘శివాలయం’ కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నేను కూడా నటిస్తున్నాను. మా చిత్ర బృందం మొత్తాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “శివాలయం అనే టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. శివుడి నేపథ్యంలో వచ్చిన పాటలు, కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి మంచి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథ, బలమైన భావోద్వేగాలతో ‘శివాలయం’ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.
వెంకట్‌రెడ్డి గారికి ఇది 11వ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత వెంకట్‌రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘శివాలయం’ ఘన విజయం సాధించి చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
శివుడి లీలలను ఆవిష్కరించే చిత్రం: వెంకట్‌రెడ్డి నంది
చిత్ర దర్శకుడు, నిర్మాత వెంకట్‌రెడ్డి నంది మాట్లాడుతూ.. “శివుడి లీలలు, మహిమలు, భక్తి భావనను ప్రేక్షకులకు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ‘శివాలయం’ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఈ కథపై ఎంతో కాలంగా కసరత్తు చేస్తున్నాం. గత ఆరు నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో నిర్వహించాం.
ప్రేక్షకులకు భక్తితో పాటు మంచి కథ, భావోద్వేగాలు, వినోదాన్ని అందించేలా ఈ సినిమాను రూపొందించనున్నాం. వచ్చే సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక అంశాలు, షూటింగ్ వివరాలతో పాటు పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం” అని తెలిపారు.

నటీనటులు
ఆచంట మహేష్ (రంగస్థలం ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఘర్షణ శ్రీనివాస్, లెంకల అశోక్ రెడ్డి, మురం రెడ్డి వెంకటేశ్వర్లు, కుప్పిలి శ్రీనివాస చారి, మధుమతి కొక్కంటి, ముత్యాల ఉమా, చిట్టిబాబు, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
నిర్మాత, దర్శకుడు: వెంకట్‌రెడ్డి నంది
సంగీతం: డ్రమ్స్ రాము
కోరియోగ్రఫీ: నిహారిక చౌదరి
ఛాయాగ్రహణం (డి.ఓ.పి): డి. యాదగిరి
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.