Skip to content

‘మహాకాళి’ 2027 జనవరి 8న గ్రాండ్ రిలీజ్

ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్, పూజా కొల్లూరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీవీసీయూ (PVCU) మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ ‘మహాకాళి’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. #శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘మహాకాళి’ థియేటర్లలోకి రానుంది.

ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి-చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. “ది ఎండ్ బిగిన్స్” గా మహా సంగ్రామానికి నాంది పలికారు.

గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అక్షయ్ ఖన్నా. శుక్రాచార్యుడిగా ఆయన కొత్త అవతార్‌లో కనిపించారు. ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన పాత్రపై ఆసక్తిని మరింత పెంచారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్ మరింత పెంచింది.

అలాగే శ్రియా రెడ్డి కూడా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. భారీ సెట్స్, విస్తృతమైన వరల్డ్ బిల్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘మహాకాళి’ ప్రపంచాన్ని భారీ స్థాయిలో ఆవిష్కరించినట్లు గ్లింప్స్ సూచిస్తోంది.

‘హనుమాన్’తో పీవీసీయూ కు బలమైన పునాది వేసిన ప్రశాంత్ వర్మ.. భారతీయ ఇతిహాసాలను మోడరన్ విజువల్ ట్రీట్‌మెంట్‌తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నట్లు ఈ 2 నిమిషాల 55 సెకన్ల గ్లింప్స్ ద్వారా ప్రజెంట్ చేశారు.

ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. పీవీసీయూ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది నెక్స్ట్ పార్ట్ గా రాబోతోంది. అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డితో పాటు భూమి శెట్టి, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తారాగణం: భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సరాఫ్, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్రఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీ శర్మ, నాసర్, బబ్లూ పృథ్వీరాజ్

సాంకేతిక సిబ్బంది:
క్రియేటర్: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు
బ్యానర్: RKD స్టూడియోస్
సమర్పణ: ఆర్కే దుగ్గల్
నిర్మాత: రివాజ్ దుగ్గల్
సంగీతం: స్మరణ్ సాయి
DoP: సురేష్ రగతు
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
Ex-Producer:: వెంకట్ కుమార్ జెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్: శిల్పా GNS
పబ్లిసిటీ: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.