‘మహాకాళి’ 2027 జనవరి 8న గ్రాండ్ రిలీజ్
ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్, పూజా కొల్లూరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీవీసీయూ (PVCU) మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ స్పెక్టకిల్ ‘మహాకాళి’ నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. #శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘మహాకాళి’ థియేటర్లలోకి రానుంది. ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. ఇది కేవలం మంచి-చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తున్నట్లు గ్లింప్స్‌లో…
