Skip to content

నిధి అగర్వాల్ చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ హెల్త్ అండ్ వెల్‌నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్‌నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల అందంగా, ఫిట్‌గా కనిపించడం మరింత ముఖ్యాంశంగా మారింది. కలర్స్ 2.0 లో లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త మెషిన్లు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. ఇలాంటి మంచి వాతావరణంలో హెల్త్, డైటింగ్ పై శ్రద్ధ పెడితే మరింత మోటివేషన్ లభిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన వెల్‌నెస్ సదుపాయాలతో కలర్స్ 2.0 కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బరువు నిర్వహణతో పాటు చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలకు నిపుణుల సేవలు అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి వారికి కలర్స్ హెల్త్‌కేర్ వంటి ప్రత్యేక వెల్‌నెస్ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అవసరమైన వారు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కలర్స్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ (Kolors Healthcare Managing Director Dr. Vijay Krishna) మాట్లాడుతూ.. ప్రజల మారుతున్న జీవనశైలి, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొంపల్లి కేంద్రాన్ని అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన వెల్‌నెస్ సేవలను అందించడమే లక్ష్యమన్నారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన (Kolors Healthcare Executive Director Venkata shivaji Kuna) మాట్లాడుతూ.. కొంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన కేంద్రం సంస్థకు 55వ శాఖ అని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా కలర్స్ హెల్త్‌కేర్ వినియోగదారుల వివిధ అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ వస్తోందన్నారు. స్థానిక ప్రజల జీవనశైలి, ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వెల్‌నెస్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కలర్స్ హెల్త్‌కేర్ శాఖలను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మరో నూతన శాఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన మదురైలోనూ తాజా ‘కలర్స్ 2.0’ శాఖను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కలర్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ తుమ్మల (Operations Director Krishna raj tummala) మాట్లాడుతూ.. కస్టమర్ల అభ్యర్థన మేరకే కొంపల్లిలో నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 23 ఏళ్లుగా వెల్‌నెస్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ నిరంతరం అప్‌డేట్ అవుతూ సేవలను మెరుగుపరుచుకుంటోందన్నారు. కస్టమర్ల సంతృప్తే తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
బరువు నిర్వహణతో పాటు వివిధ ఆరోగ్య, వెల్‌నెస్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సమగ్ర డెర్మటాలజీ, వెల్‌నెస్ సేవలను అందించే సంస్థగా కలర్స్ హెల్త్‌కేర్ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. అర్హత కలిగిన డెర్మటాలజిస్టులు, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన సిబ్బంది సహకారంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

కొంపల్లిలోని సుచిత్ర ఎక్స్‌ రోడ్స్‌లో, చెన్నై షాపింగ్ మాల్‌కు ఎదురుగా ఉన్న జూడియో భవనంలోని మూడో అంతస్తులో నూతన శాఖను పూర్తి స్థాయి సదుపాయాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచ స్థాయి బరువు తగ్గింపు కార్యక్రమాలతో పాటు చర్మ సౌందర్యం, స్కిన్ ఎస్తెటిక్స్, హెయిర్ కేర్కు సంబంధించిన ఆధునిక చికిత్సలు, సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ప్రజలకు ఆధునిక హెల్త్‌కేర్, వెల్‌నెస్, బ్యూటీ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని కలర్స్ హెల్త్‌కేర్ యాజమాన్యం పేర్కొంది.

ఈ సందర్భంగా కలర్స్ హెల్త్‌కేర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న పలువురు కస్టమర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. కలర్స్ అందిస్తున్న సేవలు, చికిత్సలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో చికిత్స తీసుకున్న అనంతరం తాము బరువు తగ్గినట్లు తెలిపారు. బరువు నిర్వహణతో పాటు సంబంధిత అవసరాలు ఉన్న వారు కలర్స్ హెల్త్‌కేర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 5ఎం మీడియా ఆధ్వర్యంలో నిర్వహించగా, జయదీప్ పర్యవేక్షించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యువత, ప్రముఖులు, వెల్‌నెస్ రంగ నిపుణులు, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ఆహ్వానిత అతిథులు హాజరయ్యారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.