రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టి పండుగ సెలబ్రేట్ చేశారు…
రోజా సెల్వమణి కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డయానా’..సోనీ లివ్‌లో స్ట్రీమింగ్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మన నెటివిటీకి, మన సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం.
చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగిందనే పాయింట్ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు ఏకమవుతాయి. కుటుంబంలో ఉండే అంచనాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం యువకుడు చేసే ప్రయాణం మధ్య ఎదురయ్యే సంక్లిష్టతలే ఈ కథలో ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి.
మిలియన్-డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ‘అన్బే డయానా’ చిత్రంతో రోజా సెల్వమణి మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె పరి తల్లి సరళ పాత్రలో కనిపించారు. పరి ఎలవళగన్ కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో రోజా సెల్వమణి కీలక పాత్ర పోషించారు. ఆమె పాత్ర కథకు మరింత ఆత్మీయతను, భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా .. రోజా సెల్వమణి మాట్లాడుతూ ‘‘అన్బే డయానా’ చిత్రంతో మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వటం నాకెంతో నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాలోని ప్రేమ,ఆత్మీయత, కామెడీ, కుటుంబం, బంధాలు, భిన్నమైన సంస్కృతులను కలిపి చూపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. సరళ పాత్రకు తనదైన వ్యక్తిత్వం, భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాత్రకు జీవం పోయడాన్ని నేను ఆస్వాదించాను. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉంది. థియేటర్లలో సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులతో పాటు, అక్కడ చూడలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ఇంటి నుంచే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. మేం ఈ సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు ఎంతగా ఆస్వాదించామో, అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
రోజా సెల్వమణి కమ్‌బ్యాక్ చిత్రం ‘అన్బే డయానా’ను ఇప్పుడు సోనీ లివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్‌లో చూసి ఆస్వాదించండి.

