రోజా సెల్వమణి కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘అన్బే డయానా’..సోనీ లివ్‌లో స్ట్రీమింగ్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్బే డయానా’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కామెడీ, మన నెటివిటీకి, మన సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరువ కానుంది. ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ అందమైన కథను ఆస్వాదించే అవకాశం. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘అన్బే డయానా’ సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగిందనే పాయింట్ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు…
