రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
తెలుసు కదా నుంచి మల్లిక గంధ లాంచ్

-మల్లారెడ్డి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన ‘తెలుసు కదా’ మూవీ టీం
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ – మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.
మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది. థమన్ ఎస్ కంపోజిషన్ బ్రిలియంట్ గా వుంది. తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాల్ని మోడరన్ టచ్ లో వినిపించడం అదిరిపోయింది.
సిద్ శ్రీరామ్ వాయిస్ మాటల్లో చెప్పలేనంత ఫీల్ ని ఇస్తుంది. అతని వాయిస్ లోని ఇంటెన్సిటీ పాటకి ఓ ప్రత్యేక స్టయిల్ ని తీసుకొచ్చింది.
దర్శకురాలు నీరజా కోన, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ కలసి ప్రేమ ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా మలిచారు. ప్రతీ ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్ లా వుంది.
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్ కు మరింత బ్యూటీని యాడ్ చేశాయి. రొమాంటిక్ సీన్స్, జోష్ నింపే డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. లవ్ అండ్ మ్యూజికల్ సెలబ్రేషన్స్ కు ఇది పర్ఫెక్ట్ సాంగ్ గా నిలిచింది.
ఈ మూవీలో మరో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొళ్ల ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ షీతల్ శర్మ.
తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
DOP: జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
PRO: వంశీ-శేఖర్