‘గరివిడి లక్ష్మి’ థియేటర్లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చూస్తున్నట్టుగా ఉంటుంది: తేజ సజ్జా
భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు…
