మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం సంబరాల ఏటిగట్టు…
‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ రిలీజ్
‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి రెండు సంచలనాత్మక బ్లాక్‌బస్టర్లను అందించిన సూపర్ హీరో తేజ సజ్జ మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి’తో తెలుగు సినిమాకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ఓటీటీ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ చిత్రాన్ని మరింత ఇంటెన్స్‌గా తెరకెక్కించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్’ తర్వాత వస్తున్న చిత్రమిది. రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమా స్కేల్ ఎలా ఉండబోతుందో చూపించింది. ఈ గ్లింప్స్‌ను పూర్తిగా రివర్స్ ఆర్డర్‌లో ప్రజెంట్ చేశారు. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించలేదని మొదటే స్పష్టం చేశారు.
ఫ్లైఓవర్‌పై నుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటంతో గ్లింప్స్ మొదలవుతుంది. ‘Zombies are back’ అనే క్యాప్షన్‌తో ఆ సీన్ మరింత ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత హీరో డ్రైవ్ చేస్తున్న కారు నుంచి ఆ జాంబీ పడిపోయిందని, చుట్టూ ఉన్న జాంబీలు దానిపై దాడి చేస్తున్నారని తెలుస్తుంది.
ఆ తర్వాత యాక్షన్ చార్మినార్‌కు షిఫ్ట్ అవుతుంది. చేతిలో బ్యాట్ పట్టుకుని కారుపై నిల్చున్న తేజ సజ్జా.. భారీ సంఖ్యలో ఉన్న జాంబీలతో పోరాడుతాడు. “This time, next level” అంటూ ఆయన చెప్పడంతో టైటిల్ ‘’జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ రివీల్ అవుతుంది.
టైటిల్ లోగోను కూడా వీడియో గేమ్ జాయ్‌స్టిక్ తరహాలో, జాంబీ చేతితో డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ చూస్తే ఈసారి జాంబీ ప్రపంచాన్ని మరింత భారీగా, యాక్షన్‌తో, విజువల్ స్పెక్టకిల్‌తో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.
తేజ సజ్జా యంగ్ మ్యాన్ లుక్‌లో ఆకట్టుకున్నారు.ఈసారి కథ, యాక్షన్, స్కేల్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. సినిమా బిగ్గర్, బ్యాడర్, బ్లడియర్ గా ఉండబోతుంది.
‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలకు తేజ సజ్జాతో కలిసి పనిచేసిన గౌరహరి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ జానపద ట్యూన్‌ను రాక్ ఎలిమెంట్స్, జాంబీ థీమ్ సౌండ్స్‌తో మిక్స్ చేసిన విధానం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఎనర్జీని తీసుకొచ్చింది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్, విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్. హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ ఎస్. వర్మ స్క్రీన్‌ప్లే అందించగా, సుబ్బు కె. డైలాగ్స్ రాశారు.
‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – Dead Or Alive’ 2027లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: తేజ సజ్జా, ఉపేంద్ర, షానాయ కపూర్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సుపర్ణ్ ఎస్ వర్మ
క్రియేటర్: ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: గౌర హరి
DOP: అభినందన్ రామానుజం
ప్రొడక్షన్ డిజైనర్: బంగ్లాన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
రచయితలు: హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్న్ ఎస్ వర్మ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: అనిల్ ఆనంద్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి
డైలాగ్స్: సుబ్బు కె
మార్కెటింగ్: మనోజ్ వల్లూరి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్ ఏజెన్సీ: హాష్‌ట్యాగ్ మీడియా

