రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ చేతుల మీదుగా ‘అరణ్య ధార’ ట్రైలర్ విడుదల

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’. ఈ చిత్రాన్ని ‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం నిర్మించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే పాట రిలీజ్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకులు, సింగర్ అయినటువంటి రఘు కుంచె ఆ పాటను లాంచ్ చేయగా దానికి విశేషాదరణ లభించింది. తాజాగా ట్రైలర్ ను ‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ” ‘అరణ్య ధార’ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. శివ, బాలు ఓ కొత్త పాయింట్ తీసుకుని ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. కచ్చితంగా ఈ యంగ్ టాలెంట్ ను ప్రేక్షకులు ప్రోత్సహిస్తారు అని భావిస్తూ.. టీం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని తెలిపారు
‘అరణ్య ధార’ ట్రైలర్ 1: 52 నిమిషాల నిడివి కలిగి ఉంది. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో ట్రైలర్ ను కట్ చేసినట్టు. హీరోయిన్ మిస్ అవ్వడంతో.. పోలీస్ అయినటువంటి ఆమె తండ్రి హీరోని అరెస్ట్ చేసి విచారించడం. ఆ తర్వాత ఊహించని విధంగా అతను కూడా మిస్ అవ్వడం.ఆ తర్వాత హీరో వెళ్లి అడవిలో పడటం.. వంటి అంశాలతో ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు :
బాలు నాయుడు,ఆశ సుదర్శన్, రేవతి నాధ, వెంకట్ పసుపులేటి, నాయకంటి స్వేతాంజలి, ప్రసాద్ పూసల,సంజయ్ సముద్రాల, జంజుర్ నిఖిల్,శివ పచ్చ తదితరులు
కథ – స్క్రీన్ ప్లే – మాటలు : శివ పచ్చ
దర్శకత్వం : శివ పచ్చ, బాలు నాయుడు
నిర్మాత : బాలు నాయుడు
నిర్మాణ సంస్థ : సిల్వర్ స్క్రీన్ షాట్స్
సంగీతం : రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ : చైతన్య దామెర్ల
పీఆర్ఓ : ఫణి కుమార్ పులపర్తి