- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
“ధర్మవరం” సినిమా పోస్టర్ ఆవిష్కరణ

ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు.
ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ –
“ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది” అని తెలిపారు.
అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ –
“ధర్మవరం పోస్టర్ చాలా బాగుంది. కొత్త ప్రయత్నం కనబడుతోంది. రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
“ధర్మవరం” సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Banner Name : Village Talkies
Hero : RAJE VENKATACHCHA
Heroine : SANYOGITA
MUSIC : VIJETH KRISHNA
DOP : SHARATH PARUCHURI
EDITOR : SHARATH
LYRICS : BABU
PRODUCER : PRASAD, NERIMETLA VENKAT REDDY
DIRECOR : RAJE VENKATACHCHA
PRO : Duddi Sreenu