Skip to content

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన ప్రచార కార్యక్రమాలకు తోడ్పడిన అనంతరం, ఇప్పుడు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలో విజయవంతంగా అడుగుపెట్టారు. ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సీరిస్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. ఈ వెబ్‌సీరిస్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. నిర్మాతగా ఆయన ప్రయాణానికి మంచి శుభారంభాన్ని అందించింది. ఈ సిరీస్‌ను నిర్మించడం మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్ మరియు రచయితల బృందంతో కలిసి సిరీస్‌లోని పలు భాగాలకు రచనలో కూడా శరత్ చంద్ర నాయుడు కీలక సృజనాత్మక సహకారం అందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలపై, కథనంపై…

Read more

“లెనిన్” గన్ షాట్ బ్లాక్ బస్టర్ అవుతుంది : నటుడు శివాజీ

'లెనిన్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటుడు శివాజీ సినిమా గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన సినీ ప్రయాణం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున ఇచ్చిన అవకాశంతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల ప్రేమతోనే ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు నాగార్జునతో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. 'లెనిన్' తన హృదయానికి చాలా దగ్గరైన సినిమా అని చెప్పిన శివాజీ, ఈ చిత్రంలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయని, ఆర్టిస్టులు కనిపించరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అఖిల్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని, అభిమానులు ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో అలాంటి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అన్నారు. అఖిల్ విజయం కోసం నాగార్జున చేసిన కృషిని…

Read more

శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్‌లో డబ్బింగ్ చెప్పింది కొంత మందికే అయినా అందులో ఆయన మార్క్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు…

Read more
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’! Telugu News

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని’!

'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ఫైవ్ ట్రెండింగ్ లిస్టులో స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఒక సర్పంచ్ ఎదుర్కొనే రహస్యాలు, సవాళ్లను హాస్య రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. నియమబద్ధమైన గ్రామాధికారి ఒక కుట్రలో చిక్కుకుని తన కుటుంబంతో కలిసి ఒక అనిశ్చిత ప్రయాణం చేయడం ద్వారా స్థానిక పోటీలు, రహస్యాలు బయటపడతాయి. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హాస్య అంశాలను సమతుల్యంగా మిళితం చేసి, ఆకర్షణీయమైన కథనంతో ఆద్యంతం ఆసక్తిని కొనసాగిస్తుంది. మార్చి 6న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ సినిమా, ఏప్రిల్ 3…

Read more
ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కీలక సమావేశం ! Telugu News

ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కీలక సమావేశం !

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంస్థను బలోపేతం చేస్తూ ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి మరియు గుంటూరు జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. AAFA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శివ కుమార్ గారు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” సందేశాన్ని ముందుకు తీసుకెళుతూ సమాజ సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

Read more
ప్రైమ్ వీడియో నుంచి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ “చీకటిలో” – ఆకట్టుకుంటున్న ట్రైలర్.. Telugu News

ప్రైమ్ వీడియో నుంచి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ “చీకటిలో” – ఆకట్టుకుంటున్న ట్రైలర్..

హైదరాబాద్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ప్రైమ్ వీడియో', ఈరోజు తమ కొత్త తెలుగు సినిమా "చీకటిలో" ట్రైలర్‌ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. చంద్ర పెమ్మరాజు మరియు శరణ్ కొపిశెట్టి ఈ కథను అందించారు. సినిమా వివరాలు: హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో, శోభితా ధూళిపాళ 'సంధ్య' అనే పాత్రలో కనిపిస్తారు. సంధ్య ఒక క్రైమ్ పాడ్‌కాస్టర్. 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్‌కాస్ట్ ద్వారా కనిపెట్టడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ మరియు విశ్వదేవ్…

Read more
“ధర్మవరం” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ Telugu News

“ధర్మవరం” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ – “ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం…

Read more
లేత గులాబీ టైటిల్ లాంచ్ Telugu News

లేత గులాబీ టైటిల్ లాంచ్

79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శతాధిక చిత్రాల హీరో సుమన్ గారు మరియు శతాధిక చిత్రాల దర్శకులు శ్రీ ఓం సాయి ప్రకాష్ గారు లేత గులాబీ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేసి దర్శకుడు మరియు నిర్మాతలను ఆశీర్వదించారు. వారాహి మీడియా హౌస్ సమర్ప ణ లో మీనాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై సుందర్ దర్శకత్వంలో శ్రీనివాస్ మరియు ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం లేత గులాబి. విభిన్న ప్రేమ కథ తో పాటు సమాజ హిత సందేశాత్మక ఈ చిత్రానికి వెంకట్ బాలగోని సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మీడియాకు చెప్పారు.

Read more