Skip to content

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” ఫస్ట్ లుక్ విడుదల !!!

జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు సముద్ర, నటుడు పృద్వి తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకులు నరసింహ నంది మాట్లాడుతూ…
మా ఈవెంట్ కు వచ్చిన ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ గా అన్ని సమస్యలను సున్నితంగా పరిస్కరిస్తూ ఉంటారు. మల్లారెడ్డి పాత్ర చేసిన పృద్వి గారికి థాంక్స్, మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు వారికి అలాగే సముద్ర గారు మమ్మల్ని విష్ చెయ్యడానికి వచ్చారు, వారికి ధన్యవాదాలు, నిర్మాతలు నరేష్ గౌడ, పరిగి మల్లిక్ ఈ సినిమాను చాలా ప్యాషన్ తో చేశారు, కమర్సియల్ అంశాలతో కూడుకున్న కథ ఇది, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ కథకు కనెక్ట్ అవుతారని తెలిపారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ….
నేను నరసింహ నంది మంచి స్నేహితులము, ప్రతి సినిమా విభిన్నంగా చేస్తూ వచ్చారు, ప్రభుత్వ సారాయి దుకాణం మోషన్ పోస్టర్ చాలా బాగుంది, నిర్మాతలు పరిగి మల్లిక్, నరేష్ గౌడ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు, కెమెరామెన్ మోహన్ గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు, వారందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ….
నరసింహ నంది డైరెక్ట్ చేసిన 1940 లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం విశేషం, తన దర్సకత్వంలో రాబోతున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో నటించిన నటీ నటులందరికి శుభాకాంక్షలు, ఈ చిత్ర యూనిట్ చాలా క్రమశిక్షణతో కనిపిస్తున్నారు, టాలెంట్ తో పాటు క్రమశిక్షణ చాలా అవసరం, ఈ సినిమా వీరందరికి మంచి పేరును తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం లేదు, ఆర్టిస్ట్ గా కాకుండా గెస్ట్ గా వచ్చిన పృద్వి ఈ సినిమా చాలా బాగుందని చెపుతున్నారు, తప్పకుండా ఆయన మాటలు నిజం కాబోతున్నాయని తెలిపారు.

నటుడు పృద్వి మాట్లాడుతూ….
ఎస్విఎస్ ప్రొడక్షన్స్ లో వస్తోన్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ను డైరెక్ట్ చేసిన నరసింహ నంది దర్శకత్వంలో నటించాలని ఎప్పటినుండో అనుకున్నాను, ఇప్పటికి నాకు ఇతని డైరెక్షన్ లో మంచి పాత్రలో నటించాను, ఎంతో మంది మంచి ఆర్టిస్ట్ లను పరిచయం చేసిన నరసింహ నంది ఈ సినిమాలో మరింతమంది కొత్త నటీనటులను పరిచయం చేసారు, ఈ సినిమాలో మా అమ్మాయి శ్రీలు చక్కటి రోల్ లో ఈ సినిమాలో నటించింది తనతో పాటు అందరికి ఈ సినిమా ఒక మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నిర్మాత నరేష్ గౌడ మాట్లాడుతూ….
మమ్మలి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, పృథ్వి గారికి, సముద్ర గారికి కృతజ్ఞతలు, మా అన్న గురువు పరిగి మల్లిక్ గారితో కలిసి ఈ సినిమా నిర్మిచడం సంతోషంగా ఉంది, నరసింహ నంది గారు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు రేపు అందరూ అదే ఫీల్ అవుతారు, త్వరలో మా ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా థియేటర్స్ లో అందరిని అలరించబోతోందని తెలిపారు.

నిర్మాత పరిగి మల్లిక్ మాట్లాడుతూ…
అతిథులకు మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అందరికి కృతజ్ఞతలు, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా మా మూడేళ్ళ జర్నీ, ఎంతో కష్టపడి నాతో కలిసి నరేష్ గౌడ ఈ సినిమాను నిర్మించారు, నరసింహ నంది గారు ప్రాణం పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది, అందరూ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం బెస్ట్ ఇచ్చారని తెలిపారు.

హీరో విక్రమ్ మాట్లాడుతూ…
ఆడిషన్స్ లో నన్ను సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు నరసింహ నంది గారికి కృతజ్ఞతలు, ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరో సదన్ మాట్లాడుతూ…
ఈ సినిమా నా కెరీర్ లో ఒక మంచి సినిమాగా మిగిలిపోతుందని నమ్మకం ఉంది, ఒక సినిమాలో నటించానాన్న తృప్తి ఉందన్నారు

హీరో వినయ్ మాట్లాడుతూ…
ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహ నంది గారికి నిర్మాతలు నరేష్ గౌడ గారికి పరిగి మల్లిక్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరోయిన్ అధితి మైకేల్ మాట్లాడుతూ…
ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాను డైరెక్టర్ నరసింహ నంది గారు అద్భుతంగా తెరకెక్కించారు, ఈ సినిమా లో నటించినందుకు గర్వాంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాలను ఆడియన్స్ ఆధరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

హీరోయిన్ శ్రీలు దాసరి మాట్లాడుతూ…
నరసింహ నంది గారి దర్శకత్వంలో ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఒక మంచి రోల్ లో నటించాను, తప్పకుండా నా పాత్ర మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ మోహన సిద్ది మాట్లాడుతూ…
ఈ సినిమా లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు నరసింహ నంది గారికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాలో నటించానన్న హ్యాపీ నెస్ ఉంది, త్వరలో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

నటుడు తిలక్ మాట్లాడుతూ….
ఎన్నో సినిమాల్లో మంచి రోల్స్ లో నటించిన నాకు ఈ సినిమాలో మరో గుర్తిండిపోయే పాత్రలో నటించాను, ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది, డైరెక్టర్ నరసింహ నంది, నిర్మాతలు నరేష్, మల్లిక్ కు ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు: ఆర్.విక్రమ్ , సదన్ హాసన్, వినయ్, నరేష్ రాజ్, అదితి మైకేల్, శ్రీలు దాసరి, మోహన సిద్ది, రంగరాజు, పృద్వి, తిలక్, బాలు నాయక్, స్వప్న, జ్యోతి, బలగం సహాదేవ్, బలగం రమేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: ఎస్విఎస్ ప్రొడక్షన్, శ్రీనిధి సినిమాస్
నిర్మాతలు: దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్
ఎడిటర్ : వి . నాగిరెడ్డి
సంగీతం: ఎస్ ఎస్
కెమెరామెన్: ఎస్.మురళి మోహన్ రెడ్డి
పిఆర్ఓ : శ్రీధర్, విశ్వనాథ్ తన్నీరు
రచన , దర్శకత్వం: నరసింహ నంది