Skip to content

నా కింగ్డమ్ కు సందీప్ వంగా చీఫ్ ఆర్కిటెక్ట్, గౌతమ్ తిన్ననూరి కొత్త ఆర్కిటెక్ట్ – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా మూవీ “కింగ్డమ్” ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కింగ్డమ్ బాయ్స్ పేరుతో సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రమోషన్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ ‘నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారు..’ అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు.

సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ చేసిన ఆర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు. అలాగే గౌతమ్ డైరెక్షన్ లో రూపొందిన కింగ్డమ్ కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకే కింగ్డమ్ బాయ్స్ పేరుతో వీరిద్దరితో విజయ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. రేపు కింగ్డమ్ ట్రైలర్ తిరుపతిలో గ్రాండ్ లాంఛ్ కానుంది. ఈ ట్రైలర్ కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తన్నారు. ఈ సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.