మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి


– ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి
‘సమాజంలోని ప్రతి పౌరుడు భవిష్యత్ తరాల వారి కోసం మొక్కలను నాటడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలి. అప్పుడే వాయు కాలుష్యం తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. భూగర్భ జలాలు పెరిగి, నీటికీ ఇబ్బందులు ఉండవు’’ అని శ్రీచైతన్య స్కూల్స్ మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్ ఎన్.స్వాతి తెలిపారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ‘గ్రీన్ ఇండియా మిషన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబట్టి, ‘మొక్కల పెంపకం చేపట్టాలి’ అంటూ పుర వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏజీఎం కృష్ణ ప్రారంభించారు. అనంతరం కృష్ణ, ఎన్.స్వాతి మాట్లాడుతూ–‘‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలి. తమ తల్లితండ్రులకు కూడా అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ఆర్‌ఐ హరికృష్ణ, కో ఆర్డినేటర్ జనార్ధన్, డీన్ మల్లేశ్, ఇంచార్జ్‌లు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
