Skip to content

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

– ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌.స్వాతి శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బి.ఎస్‌. రావు మెమోరియల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ బహుమతుల ప్రదానోత్సవాన్ని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బి.ఎస్‌. రావు మెమోరియల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ సందర్భంగా వార్షిక క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్‌ కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ శ్రీ మల్లేష్,…

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పలు యోగా ఆసనాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ–ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుంది. యోగా కేవలం వ్యక్తిగత జీవనశైలికే కాకుండా ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరం. అదేవిధంగా సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా ఎంతో అవసరం. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చు. పని, పోషణ, నిద్రలతో…

Read more
ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌ Telugu News

ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్‌ సైన్స్‌ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పుష్ప, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Read more
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News

ఘనంగా అధికార ప్రదానోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, అపోలో హాస్పిటల్‌ వైద్యురాలు జేబ కలీల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి, డీన్‌ మల్లేష్,…

Read more
5b2d8479-14a9-4b3c-9ee5-366eac3f0e9f

మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ఉట్టిపడేలా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకంగా పసుపు, కుంకుమ బొట్లు, వేపమండలతో అలంకరించిన మట్టి కుండలను విద్యార్థినులు తలపైకి ఎత్తుకుని సందడి చేశారు. విద్యార్థుల పోతుల రాజు, శివ సత్తుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాలల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి కలసి బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ వేడుకల్లో మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పద్మా పల్లవి, ప్రీ…

Read more
8e3ba183-9fc9-4e26-9385-c7519dbed0fb

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

– ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ‘సమాజంలోని ప్రతి పౌరుడు భవిష్యత్‌ తరాల వారి కోసం మొక్కలను నాటడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలి. అప్పుడే వాయు కాలుష్యం తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. భూగర్భ జలాలు పెరిగి, నీటికీ ఇబ్బందులు ఉండవు’’ అని శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి తెలిపారు. స్మార్ట్‌ లివింగ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబట్టి, ‘మొక్కల పెంపకం చేపట్టాలి’ అంటూ పుర వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏజీఎం కృష్ణ ప్రారంభించారు. అనంతరం కృష్ణ, ఎన్‌.స్వాతి…

Read more