Skip to content

ఘనంగా అధికార ప్రదానోత్సవం

ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, అపోలో హాస్పిటల్‌ వైద్యురాలు జేబ కలీల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి, డీన్‌ మల్లేష్, కోఆర్డినేటర్‌ జనార్ధన్, ఇన్‌చార్జులు పల్లవి, బాలరాజు, ఆంజనేయులు, పీఈటీలు కృష్ణ, అనిత, విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.