Skip to content

“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

  • “సుధీర్స్ జోకర్” చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సుధీర్స్ జోకర్”. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అందరి ప్రశంసలు అందుకున్న పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మురళీశర్మ డిటెక్టివ్ జీవన్ పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న మురళీశర్మకు ఈ డిటెక్టివ్ జీవన్ పాత్ర మరో గుర్తుండిపోయో క్యారెక్టర్ కాబోతోంది. బర్త్ డే పోస్టర్ చూస్తుంటే మురళీశర్మ బాడీ లాంగ్వేజ్, ఆయన తరహా నటనకు ఈ పాత్ర యాప్ట్ గా అనిపిస్తోంది. రాయల్ ఫ్యామిలీలో పుట్టి రాబరీస్ చేస్తున్న హీరో క్రైమ్ కేసులను తన ఇంటెలిజెన్స్, ఎక్సిపీరియన్స్ తో డీకోడ్ చేసేందుకు డిటెక్టివ్ జీవన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ సినిమాలో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించనుంది.

స్ట్రాంగ్ కంటెంట్, క్యారెక్టర్స్ తో ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా “సుధీర్స్ జోకర్” సినిమా తెరకెక్కుతోంది.

నటీనటులు – సుడిగాలి సుధీర్, అయేషా, అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్, తదితరులు

టెక్నికల్ టీమ్
—————————
ప్రొడక్షన్ డిజైనర్ – విఠల్ కోసనం
కాస్ట్యూమ్ డిజైనర్ – చిన్మయి కకిలేటి
ఎడిటిర్ – ధర్మేంద్ర కాకర్ల
సినిమాటోగ్రఫీ – అహ్మద్ షెరీఫ్
మ్యూజిక్ – లియోన్ జేమ్స్
ప్రొడ్యూసర్స్ – శ్రీనివాసులు.పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ
స్క్రిప్ట్, డైరెక్షన్ – పీఎస్ సునీల్ పుప్పాల
డిజిటల్ మార్కెటింగ్ – హాష్ ట్యాగ్ మీడియా
పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.