"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న…
‘కపాలి’ నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘కపాలి’ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా హన్సిక మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. ‘కపాలి’ కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తారాగణం: రోహిత్ నారా, హన్సిక మోత్వాని
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: రామ్ గన్ని
సమర్పణ: విజయ్ కృష్ణ లింగమనేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప
బ్యానర్: సప్త అశ్వ మీడియా వర్క్స్
PRO: వంశీ-శేఖర్

