Skip to content

ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రిలీజ్

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్ పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు. ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ మహేశ్ నారాయణ మాట్లాడుతూ – ఈ మూవీకి మ్యూజిక్ చేసేందుకు డైరెక్టర్ గంగ సప్తశిఖర చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. తక్కువ టైమ్ లోనే సాంగ్స్ అన్నీ కంపోజ్ చేయగలిగాం. ప్రయోగాత్మకంగా కంపోజ్ చేసిన ఒక కవ్వాలీ సాంగ్ రాజేంద్రప్రసాద్ గారు విని ఇది చాలా బాగుంది మూవీలో పెట్టమని చెప్పారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘పాంచాలి పంచభర్తృక’ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ – మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్ స్టా పేజికి టికెట్ పెట్టండి మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. మా సినిమా ఈ నెల 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో లొకేషన్స్ లో మా మూవీ రిలీజ్ కు వస్తోంది. మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గి రెడ్డి, రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టి వారి, సాయినాథ్ మన్యం ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు. రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి ఈ చిత్రంలో కీ రోల్స్ చేశారు. వారి నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నన్ను ఇంతలా వాడుకున్న దర్శకుడు నువ్వే ని కితాబు ఇచ్చారు. ఆయన ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని చెప్పగలను. మా చిత్రంలో 50కి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపిస్తారు. ఒక ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలా మా మూవీలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారు.ఈ సినిమా మేకింగ్ లో ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – మా డైరెక్టర్ గంగ సప్తశిఖర కు మంచి కామెడీ టైమింగ్ ఉంది.ఆయన సీన్స్ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నాం. నా క్యారెక్టర్ ను ఆయన ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ నెల 14న థియేటర్స్ లో ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా తప్పకుండా చూడండి. అన్నారు.

నటుడు థర్డీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ – నా కెరీర్ ప్రారంభమైందే రాజేంద్రప్రసాద్ గారి ఆ ఒక్కటీ అడక్కు మూవీతో. ఆ సినిమాలో నా మొదటి సీన్ బైక్ పై వెళ్లే సీన్. ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ టైమ్ లో ఆ సీన్ చేసిన చోట రాజేంద్రప్రసాద్ గారు నేను కలిసి కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. రాజేంద్రప్రసాద్ గారు సపోర్ట్ చేయకుంటే ఈ థర్టీ ఇయర్స్ కెరీర్ నాకు లేదు. ఈ సినిమాలో మేము కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. మా డైరెక్టర్ గంగ సప్తశిఖర ప్రతిభావంతుడు. ఆయన నవ్వుతూనే మా అందరి దగ్గర నుంచి కావాల్సిన పర్ ఫార్మెన్స్ పిండుకున్నాడు. గంగ సప్తశిఖర దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుని ఈవీవీ గారు లేని లోటును తీర్చాలని కోరుకుంటున్నా. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అన్నారు.

నటి కుమారి ఆంటీ మాట్లాడుతూ – యూట్యూబ్ లో నన్ను ఫేమస్ చేశారు. సినిమాల్లోకి వస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ మూవీ నన్ను మీకు మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

నటుడు బాల మాట్లాడుతూ – దర్శకుడు గంగ సప్తశిఖర నాకు చాలాకాలంగా మిత్రుడు. నేనొక కన్నడ మూవీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పారు. ఇందులో డాన్ రోల్ విలన్ గా నటించాలని చెప్పారు. డాన్ రోల్ ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ ఉన్నాను. సెట్స్ లోకి వెళ్లాక ఈ డాన్ క్యారెక్టర్ తోనూ ఫన్ క్రియేట్ చేయొచ్చని మా డైరెక్టర్ చేసి చూపించారు. రాజేంద్రప్రసాద్ గారు షూటింగ్ టైమ్ లో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఒక ఫ్యామిలీ వాతావరణం సెట్స్ లో ఉండేది. మా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది మంచి ఎంటర్ టైనర్ మీరంతా చూసి ఆదరించండి. అన్నారు.

నటి సునీత మాట్లాడుతూ – ఈ చిత్రంలో పృథ్వీ గారి వైఫ్ పాత్రలో నటించాను. ఇంతమంది సీనియర్ యాక్టర్స్ నటించిన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా మూవీ మిమ్మల్ని ఏమాత్రం నిరాశపర్చదు. ఆద్యంతం వినోదాన్ని అందిస్తుంది. అన్నారు.

నటుడు యోగి మాట్లాడుతూ – ప్రస్తుతం థియేటర్స్ లో కొరియన్ కనకరాజు సినిమా ఎలా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందో, మా సినిమా కూడా ఆగస్టు 14వ తేదీ నుంచి అలాంటి ఎంటర్ టైన్ మెంట్ నే అందించబోతోంది. మా డైరెక్టర్ గంగ సప్తశిఖర ప్రతి ఒక్క క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు.ఆయన నెక్ట్స్ కూడా ఒక మంచి మూవీ చేయబోతున్నారు. అన్నారు.

నటుడు రాంకీ మాట్లాడుతూ – ఈ మూవీలో నేను నటించుకున్నా, నా బెస్ట్ విశెస్ ఈ టీమ్ కు అందించేందుకు వచ్చాను. మా డైరెక్టర్ గంగ సప్తశిఖర నెక్ట్స్ చేయబోతున్న చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో రాబోతున్న ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో డైరెక్టర్ రేష్మ మాట్లాడుతూ – అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా బలాన్నిస్తాడో మా సినిమాకు మీ ప్రేక్షకులంతా అండగా నిలబడాలి. మా టీమ్ అందరి సపోర్ట్ తో ఒక మంచి సినిమా చేశాం. ఇకపై కూడా మా టీమ్ తో ట్రావెల్ కొనసాగించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని తమ సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

నటీనటులు – డా. రాజేంద్ర ప్రసాద్, సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి, తదితరులు

టెక్నీషియన్స్
———————-
ఎడిటింగ్ – జానీ బాషా, నాగచైతన్య
సినిమాటోగ్రఫీ – కె.వి. ప్రసాద్
సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్
కథ: బాబీ కేఎస్‌ఆర్‌
స్క్రీన్‌ప్లే: రాజ్ పవన్;
బ్యానర్స్ – రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌
కో ప్రొడ్యూసర్స్ – వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం
డైరెక్షన్ : గంగ సప్తశిఖర

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.