నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘లీసా’
ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యారు మెలొడీ బ్రహ్మ మణిశర్మ. స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు వహించేందుకు ముందుకొచ్చారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది…
