Skip to content

నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘లీసా’

ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యారు మెలొడీ బ్రహ్మ మణిశర్మ. స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు వహించేందుకు ముందుకొచ్చారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లీసా’ సినిమా నవంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు: అనన్య నాగళ్ల, అల్లాల రవిరెడ్డి గారు, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు.

సాంకేతిక వర్గం:
* బ్యానర్లు: ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్
* నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల.
*అయాన్ష్ రెడ్డి మాసం ప్రెసెంట్ చేస్తున్నారు
* దర్శకత్వం: జవహర్ పవార్
* సంగీతం: మణిశర్మ
* సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే & సహ నిర్మాత: సతీష్ రెడ్డి మాసం
* ఎడిటర్: శ్రీధర్ గాదె
* స్టంట్స్: స్టంట్ వెంకట్
* కొరియోగ్రఫీ: స్నేహ
* కాస్ట్యూమ్ డిజైనర్: బండ్లమూడి గైనిప్రియ
* క్రియేటివ్ హెడ్: వీరపనేని శివ
* పీఆర్వో: సురేష్ (SK మీడియా)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.