Skip to content

శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ 2027 సంక్రాంతికి రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తనకు బాగా సూటయ్యే కథలను ఎంచుకుంటూ తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సామజవరగమన’ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతేకాదు, రామ్ అబ్బరాజు గత బ్లాక్‌బస్టర్ నారి నారి నడుమ మురారి’లో శ్రీ విష్ణు క్యామియో రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హ్యూమరస్ టైటిల్‌తోనే సినిమా ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందో ప్రజెంట్ చేశారు. బోల్డ్, రెట్రో ఇన్‌స్పైర్డ్ స్టైల్‌లో డిజైన్ చేసిన టైటిల్ సినిమా లైట్‌హార్టెడ్ మూడ్‌ను ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైబ్రెంట్, క్విర్కీ విజువల్‌తో ఫన్ కంటెంట్‌ను మరింత పెంచుతోంది.

ఫస్ట్ లుక్‌లో శ్రీ విష్ణు కలర్ ఫుల్ మల్టీ స్టోరీ ఇంటీరియర్‌లో పై నుంచి కిందికి పడుతూ కనిపిస్తున్నారు. చేతులు చాచి, షాక్ అయిన ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన కనిపిస్తుండగా.. వివిధ అంతస్తుల్లో నరేష్ వీకే, అభిరామి, సాక్షి మధోల్కర్ సహా పలువురు కుటుంబ సభ్యులు నిలబడి కింద జరుగుతున్న వింత పరిస్థితిని చూస్తున్నారు. చుట్టూ ఎగురుతున్న కరెన్సీ నోట్లు పోస్టర్‌లోని హ్యుమర్ ని మరింత పెంచుతున్నాయి.

గాల్లో తేలుతున్న సూట్‌కేస్‌, కాలిక్యులేటర్‌, మరికొన్ని వస్తువులు.. కథలో డబ్బు, కుటుంబ పరిస్థితులు కీలక అంశాలుగా ఉండబోతున్నాయనే హింట్ ఇస్తున్నాయి. మోషన్ పోస్టర్ కూడా ఇదే హ్యూమరస్ స్పిరిట్‌ను కొనసాగిస్తోంది. లైవ్లీ, ఎనర్జిటిక్ స్కోర్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ మరింత పెంచారు.

దర్శకుడు రామ్ అబ్బరాజు తన సినిమాల్లో నరేష్ వీకే ను హిలేరియస్ గా ప్రజెంట్ చేస్తుంటారు. ఈసారి శ్రీ విష్ణుతో నరేష్ వీకే కాంబినేషన్ మరోసారి హిలేరియస్ మూమెంట్స్‌ను అందించబోతోంది. వీరిద్దరి కామిక్ కెమిస్ట్రీ ‘ఫ్యామిలీ ప్యాక్’కు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.

ఇక ఈ చిత్రానికి జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ పసాల ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్ అబ్బరాజు సినిమాలతో అనుబంధం ఉన్న రచయితలు భాను భోగవరపు, నందు సావరిగాన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చివర్లో సంక్రాంతి 2027 విడుదల కానున్నట్లు ప్రకటించారు. దీంతో ‘ఫ్యామిలీ ప్యాక్’ పండగ సీజన్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు: శ్రీ విష్ణు, సాక్షి మధోల్కర్, నరేష్ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, గోపరాజు విజయ్, బుల్లి రాజు (రేవంత్), శ్రీ ముక్త, రఘుబాబు, మాణిక్ రెడ్డి, హరి ప్రసాద్, ఇమ్మానుయేల్, జి, మధుర ప్రసాద్

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: నవీన్ యెర్నేని & వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌
కో-నిర్మాత: అనిల్ యెర్నేని
CEO: చెర్రీ
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు: భాను భోగవరపు & నందు సవిరిగాన
ఫోటోగ్రఫీ: జె యువరాజ్
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: అనిల్ పసల
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఫైట్ మాస్టర్: పృథ్వీ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చెంబోలు సాయి ఆదిత్య
కాస్ట్యూమ్స్: రాజేష్ కమర్సు & విభా రెడ్డి
PRO: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: వియాకి
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.