Skip to content

సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ.. తన చుట్టూ జరిగే దాదాపు ప్రతిదాంట్లోనూ ఏదో అనుమానాస్పదమైన విషయం ఉందని భావిస్తుంటాడు. కశ్మీర్ వెళ్లిన తర్వాత ఓ అమ్మాయిని కలుసుకుంటాడు. ఆమెతో పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. మరోవైపు ఓ పోలీస్ ఆఫీసర్ సన్నీని వెంటాడటం మొదలుపెడతాడు. అసలు కశ్మీర్‌లో ఏం జరిగింది? ఆ పోలీస్ సన్నీని ఎందుకు వెంటాడుతున్నాడు? అనేదే కథలో కీలకాంశం.

‘డీజే టిల్లు’లో తన మార్క్ కామెడీని చూపించిన దర్శకుడు విమల్ కృష్ణ.. మరోసారి డిఫరెంట్ ఎంటర్‌టైనింగ్ కథతో వస్తున్నారు. ఈసారి రాగ్ మయూర్ పోషిస్తున్న ఓవర్‌థింకర్ క్యారెక్టర్ చుట్టూ కథను నడిపిస్తూ.. ఆద్యంతం మంచి కామెడీని జనరేట్ చేశారు.

ఓవర్‌థింకర్ పాత్రలో రాగ్ మయూర్ చాలా ఎఫెక్టివ్‌గా కనిపించారు. ఆయన కామిక్ టైమింగ్ ట్రైలర్‌లో మెయిన్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆయన లవ్ ఇంట్రెస్ట్‌గా మెరిన్ ఫిలిప్ చార్మింగ్‌గా కనిపించడంతో పాటు.. రాగ్ మయూర్‌తో మంచి కెమిస్ట్రీని పంచుకున్నారు. సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించినప్పటికీ అజయ్ మంచి కామెడీని పండించారు. రాశి, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చరిత్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సునీల్ కుమార్ నామా కశ్మీర్ అందాలను అద్భుతంగా క్యాప్చర్ చేశారు. విజువల్స్ సినిమాకు మంచి ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. శ్రీచరణ్ పాకాల తన సంగీతంతో కథనంలోని ఫన్ క్వొటియెంట్‌ను మరింత ఎలివేట్ చేశారు. చిలక ప్రొడక్షన్స్ మెయింటైన్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

‘అనుమాన పక్షి’ ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

నటీనటులు: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ

టెక్నికల్:
రచన, దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్
సహ నిర్మాత: భారత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్: చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మందవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రవణ్ కుప్పిలి
DOP: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: జేకే మూర్తి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.