Skip to content

భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు.

తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రశ్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు – రశ్మిక మందన్న, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
మ్యూజిక్ – అనిరుధ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీవాస్
డైరెక్టర్ – గౌతమ్ తిన్ననూరి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.